Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

గలతీయులకు 6వ అధ్యాయము

1  సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను. 
2  ఒకని భారములనొకడు భరించి యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. 
3  ఎవడైనను వట్టివాడై యుండి తాను ఎన్నికైనవాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచుకొనును. 
4  ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును 
5  ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా? 
6  వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థమున్నిటిలో భాగమియ్యవలెను2. 
7  మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. 
8  ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమనుపంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును. 
9  మనము మేలుచేయుటయందు విసుకక యుందుము. మనము అలియక మేలుచేసితిమేని తగినకాలమందు పంట కోతుము. 
10  కాబట్టి మనకు సమయము దొరికినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడల మేలుచేయుదము. 
11  నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. 
12  శరీరవిషయమందు చక్కగా అగుపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువవిషయమై హింసపొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతముచేయుచున్నారు. 
13  అయితే వారు సున్నతిపొందినవారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు; తాము మీ శరీరవిషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. 
14  అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక; దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి యున్నాము. 
15  క్రొత్తసృష్టి (పొందుటయే ) గాని సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు. 
16  ఈ పద్ధతిచొప్పున నడుచుకొనువారికందరికి, అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగును గాక. 
17  నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమపెట్టవద్దు. 
18  సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమేన్

No comments:

Post a Comment