1 మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.
2 తండ్రిచేత నిర్ణయింపబడిన దినము వచ్చుపర్యంతము అతడు సంరక్షకులయొక్కయు గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును.
3 అటువలె మనమును బాలురమై యున్నప్పుడు లోకసంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమైయుంటిమి;
4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;
5 అయన స్త్రీయందు పుట్టి మనము స్వీకృతపుత్రులము8 కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిన విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
6 మరియు మీరు కుమారులైయున్నందున - నాయనా తండ్రీ, అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోకి పంపెను.
7 కాబట్టి నీవికను దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవై యున్నావు.
8 ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని
9 యిప్పుడు మీరు దేవుని ఎరిగినవారిను, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్ ప్రయోజనమైనవియునైన మూలపాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండగోరనేల?
10 మీరు దినములను మాసములను ఉత్సవకాలములను ఆచరించుచున్నారు.
11 మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను.
12 సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను.
13 మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినవాడనై నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.
14 అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండినదానిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదుగాని దేవుని దూతనువలెను క్రీస్తుయేసునువలెను నన్ను అంగీకరించితిరి.
15 మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసియుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను.
16 నేను మీతో నిజమాడినందున మీకు శత్రవునైతినా?
17 వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో ఆశ్రయించుచున్నవారు కారు; మీరే తమ్మునాశ్రయింపవలెనని మిమ్మును ప్రత్యేకపరచ1గోరుచున్నారు.
18 నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే.
19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు పర్యంతము మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.
20 మిమ్మునుగూర్చి యెటుతోచక యున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను.
21 ధర్మశాస్త్రమునకు లోబడియుండ గోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి.
22 దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహాముకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?
23 అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను.
24 ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండసంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.
25 ఈ హాగరు అనునది అరబిదేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతోకూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయి యున్నది.
26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి.
27 ఇందుకు -కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదన పడనిదానా, బిగ్గెరగా కేకలు వేయుము; ఏలయనగాపెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు బహు విస్తారముగా ఉన్నారుఅని వ్రాయబడియున్నది2.
28 సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి (పుట్టిన ) కుమారులమై యున్నాము.
29 అప్పుడు శరీరమునుబట్టి (పుట్టిన ) వాడు ఆత్మనుబట్టి (పుట్టిన ) వానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది.
30 ఇందునుగూర్చి లేఖనమేమి చెప్పుచున్నది?3దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసికుమారుడు స్వతంత్రురాలి కుమారునితోపాటు వారసుడై యుండడు.
31 కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము.
Download Audio File

No comments:
Post a Comment