Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

గలతీయులకు 3వ అధ్యాయము

1  ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులయెదుట వర్ణింపబడెనుగదా. 
2  ఇది మాత్రమే మీవలన తెలిసికొన గోరుచున్నాను; ధర్మశాస్త్రసంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా? 
3  మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? 
4  వ్యర్థముగానే యిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? 
5  ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధమైన క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా (చేయించుచున్నాడు? ) 
6  అబ్రహాము దేవుని నమ్మినందున అది అతనికి నీతియని యెంచబడెను
7  కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలిసికొనుడి. 
8  దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులగా తీర్చునని లేఖనము దూరము చూచి -నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు3అని అబ్రాహాముకు సువార్త ముందుగా ప్రకటించెను. 
9  కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు. 
10  ధర్మశాస్త్రోక్తక్రియా సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా -ధర్మశాస్త్రగ్రంధమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగాఉండని ప్రతివాడును శాపగ్రస్తుడుఅని వ్రాయబడియున్నది. 
11  ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా -నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. 
12  ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని (విధులను ) ఆచరించువాడు వాటివలననే జీవించును. 
13-14. ఆత్మనుగూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తుమనకుగాను శాపగ్రాహియై3మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను; ఇందునుగూర్చి -మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. 
15  సహోదరులారా, మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; మనుష్యుడు చేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు. 
16  అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులనుగూర్చి అన్నట్టు - సంతానములకును అని చెప్పక ఒకనిగూర్చి అన్నట్టే - నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు. 
17  నేను చెప్పునదేమనగా - నన్నూట ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. 
18  ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగిన పక్షమందు ఇకను వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానమువలననే దానిని అనుగ్రహించెను. 
19  ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చుపర్యంతము అది అతిక్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను. 
20  మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. 
21  ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయు శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడియున్నయెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని. 
22  యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరిని పాపమునకు లోనైనవారినిగా ఎంచెను. 
23  విశ్వాస (మార్గ )ము వెల్లడికాకమునపు5ఇకముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమార్గమవలంబింపవలసిన వారముగా6చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైనవారమైతిమి. 
24  కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు విషయమై ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. 
25  అయితే విశ్వాసమార్గము వెల్లడియాయెను గనుక ఇకను బాలశిక్షకుని క్రింద ఉండము. 
26  యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కూమారులై యున్నారు. 
27  క్రీస్తులోకి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొన్నారు. 
28  ఇందులో యూదుడని హెల్లేనీయుడని లేదు, దాసుడని స్వతంత్రుడని హెల్లేనీయుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు. 
29  మీరు క్రీస్తుసంబందులైతే7ఆ పక్షమందు అబ్రహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు. 
          Download Audio File

No comments:

Post a Comment