1 అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూషలేముకు తిరిగి వెళ్లితిని.
2 దేవదర్శన ప్రకారమే వెళ్లితిని. మరియు నా పరుగు5 వ్యర్థమవునేమో, లేక వ్యర్థమైపోయినదేమో, అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని, ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని.
3 అయినను నాతోకూడనున్న తీతు హెల్లేనీయుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్టబడలేదు.
4 మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తుయేసువలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులవలన (ఆ ప్రయత్నమైనను ) జరిగినది.
5 సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు.
6 ఎన్నికైనవారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యములేదు, దేవుడు నరునివేషము చూడడు. 1ఆ యెన్నికైనవారు నా కేమియు ఉపదేశింపలేదు.
7 అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నాకప్పగింపబడెనని వారు చూచినప్పుడు,
8-9. అనగా సున్నతి పొందిన వారికి అపొస్తలుడవుటకు పేతురుకు సామర్థ్యము కలుగజేసినవాడే అన్యజనులకు అపొస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యూకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమగుటకు (సూచనగా ) నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.
10 మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెననిమాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని.
11-12. తరువాత కేఫా అంతియొకైయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని; ఏలయనగా యూకోబునొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందినవారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను.
13 తక్కిన యూదులను అతనితో కలసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోసపోయెను.
14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా - నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?
15-16. మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసమువలననే గాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసమువలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచియున్నాము, ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.
17 కాగ మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడ వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు.
18 నేను పడగొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా.
19 నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్ర విషయమై చచ్చినవాడనైతిని.
20 నేను క్రీస్తుతోకూడ సిలువవేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను శరీరమందు జీవించుచున్న జీవనము, నన్ను ప్రేమించి నాకొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.
21 నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ ప్రయోజనమే గదా.
Download Audio File

No comments:
Post a Comment